HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నేను నటించడం లేదు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నేను నటించడం లేదు

7 15
టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) ఈ సినిమా గురించి రోజూ.. ఏదోక ఓ పుకారు బయటకొస్తునే ఉంటుంది. నటుడు నవదీప్ ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్త ఈ మధ్య వినిపిస్తుంది. దీనిపై నవదీప్ స్పందించాడు. ఆర్ఆర్ఆర్ లో తాను నటించడం లేదని క్లారీటీ ఇచ్చాడు.

అయితే, మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ దీనిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చరణ్‌ కు జంటగా బాలీవుడ్‌ హీరోయిన్ ఆలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu