HomeTelugu News'RRR' 'రామ రావణ రాజ్యం'?

‘RRR’ ‘రామ రావణ రాజ్యం’?

‘బాహుబలి’ సీరీస్‌ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకు తగినట్టుగానే ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో జక్కన్న ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రం నవంబరు 11న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జక్కన్న స్నేహితుడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

9 4

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం కూడా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటే అందరూ అనుకుంటున్నట్లు రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్‌ మాత్రమే కాదు. అసలు టైటిల్‌ కూడా ఉందట. అదే ‘రామ రావణ రాజ్యం’మట. అంతేకాదు, ‘తారక్‌రామ్‌’ అనే టైటిల్‌ కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కాగా ఈ భారీ మల్టీ స్టారర్‌ చిత్రానికి జక్కన్న ఏ టైటిల్‌ పెడతారో చూడాలి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ‘RRR’ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే మిగిలిన నటీనటులు, చిత్రబృందం వివరాలను వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu