HomeTelugu Trending'దేవర'లో అల్లు అర్హ!

‘దేవర’లో అల్లు అర్హ!

Allu Arha in NTR Devara

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి ‘దేవర’ టాప్ టెక్నీషియన్స్‌ను పనిచేస్తున్నారు. ఇక ‘దేవర’లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేయగా.. ఇటీవలే కిల్లర్ సీక్వెన్స్‌ను కంప్లీట్ చేసినట్లు వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ యుగంధర్ వెల్లడించారు. అంతేకాదు ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయని చెప్పడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సినిమాలో దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఐకాన్ స్టార్ కూతురు అర్హ ఈ సినిమాలో నటిస్తున్నట్లు టాక్‌. భారీ బడ్జెట్‌, స్టార్ కాస్టింగ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు RRR తర్వాత ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా.. షైన్ టామ్ చాకో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu