HomeTelugu Trendingఅల్లు స్టూడియోస్ ప్రారంభం

అల్లు స్టూడియోస్ ప్రారంభం

Allu family inaugurates all

నేడు టాలీవుడ్‌ హాస్య నట దిగ్గజంగా పేరొందిన అల్లు రామలింగయ్య 99వ జయంతి. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు గురువారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన కుటుంబసభ్యులు అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు
అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు అల్లు అరవింద్. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. త్యాధునిక సౌకర్యాలతో ఫిల్మ్ మేకింగ్ కు అనుకూలంగా ఉండేలా ఆర్ట్ ఫిలిం స్డూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu