HomeTelugu Trendingకొడుకు స్కూల్‌ ఫంక్షన్‌లో బన్నీ ఫ్యామిలీ సందడి.. వీడియో వైరల్‌

కొడుకు స్కూల్‌ ఫంక్షన్‌లో బన్నీ ఫ్యామిలీ సందడి.. వీడియో వైరల్‌

12 16
టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌ స్కూల్‌ ఫంక్షన్‌లో అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేశారు. తన కుమారుడు ప్రీ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుకలు జరిగాయని కొన్ని రోజుల క్రితం బన్నీ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయాన్‌ పట్ల చాలా గర్వంగా ఉందంటూ అతడికి జీవితం విలువలు నేర్పిన పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చెప్పారు. కాగా ఈ వేడుకల్లో బన్నీ, స్నేహారెడ్డి, అల్లు అరవింద్‌, అల్లు నిర్మల పాల్గొన్నారు. స్టైలిష్‌ స్టార్‌ కుమార్తె అర్హ, అయాన్‌ మిగిలిన చిన్నారులతో పాటు వేదికపై ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. తన పిల్లలు డ్యాన్స్‌ చేస్తుంటే బన్నీ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. చివరిగా బన్నీ చిన్నారులకు గ్రాడ్యుయేషన్‌ మెడల్స్‌, పత్రాలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అర్హ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది.

‘అల వైకుంఠపురములో..’ తర్వాత బన్నీ సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం బన్నీ కొత్త లుక్‌లో సిద్ధమయ్యారు. శేషాచలం అడవులు, ఎర్రచందనం దొంగల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు.. అందుకోసం బన్నీ లారీ డ్రైవింగ్‌ కూడా నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది.

https://www.instagram.com/tv/B9-ydMkBHNe/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu