పాలకొల్లులో పవన్‌ కల్యాణ్‌తో అల్లు అర్జున్‌


ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థుల కోసం పవన్ కల్యాణ్‌ ప్రచారం చేస్తున్నారు. కాగా, నరసాపురం నియోజక వర్గం నుంచి నాగబాబు ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

నాగబాబుకు సపోర్ట్ చేస్తూ వరుణ్ తేజ్, నిహారికలు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటె, అల్లు అర్జున్ జనసేనకు మద్దతుగా ఈరోజు పాలకొల్లులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ తో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజల కోసం పవన్ కల్యాణ్‌ అహర్నిశలు కష్టపడుతున్నారని, జనసేన పార్టీకి మద్దతుగా నిలిచేందుకు ముందుకు వచ్చినట్టు అల్లు అర్జున్ పేర్కొన్నారు.