HomeTelugu Big Storiesమంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అతిథిగా పుష్ప

మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అతిథిగా పుష్ప

Allu Arjun chief guest for
ఆర్‌ఎక్స్‌ 100 ఫేం అజయ్ భూపతి – పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం మంగళవారం. హార్రర్ కామెడీ జోనర్‌లో ఫీ మేల్ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌, కాన్సెప్ట్‌ పోస్టర్లు, టీజర్‌, ట్రైల‌ర్‌లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా నవంబర్‌ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లు ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్‌ వస్తున్నట్లు ప్రకటించారు. మా జాతరకి పుష్ప వస్తున్నారు. నవంబర్‌ 11న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేషనల్ అవార్డు విన్నర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వస్తున్నారు.. అంటూ లాంఛ్ చేసిన లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu