HomeTelugu Big Storiesఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌ పై సందీప్‌ కిషన్‌ స్పందన

ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌ పై సందీప్‌ కిషన్‌ స్పందన

8 24

టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్‌ కిరణ్‌. వరుస వైఫల్యాల కారణంగా ఆయన కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్‌ కిరణ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని టాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కించనున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ బయోపిక్‌లో టాలీవుడ్‌ యువ నటుడు సందీప్‌ కిషన్‌ నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా సందీప్‌కిషన్‌ ఆ వార్తలను ఖండించారు. ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌లో తాను నటించడం లేదని వెల్లడించారు. అంతేకాకుండా తనకి ప్రస్తుతం బయోపిక్‌లో నటించే ఆలోచన కూడా లేదని తెలిపారు.

‘గత కొన్నిరోజులుగా ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌పై రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌ గురించి ఇప్పటి వరకూ నన్ను ఎవరు సంప్రదించలేదు. ప్రస్తుతం నాకు బయోపిక్‌లలో నటించే ఆలోచన కూడా లేదు. ధన్యవాదాలు’ అని సందీప్‌ ప్రకటించారు.

ప్రస్తుతం సందీప్‌కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ నటిస్తున్నారు. హాకీ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రమిది. మరోవైపు ఇటీవల ఆయన నటించిన ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్‌కు జంటగా హన్సిక నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలకపాత్రలో కనిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu