HomeTelugu Trendingక్రేజీ కాంబినేషన్‌ తో అల్లు అర్జున్‌!

క్రేజీ కాంబినేషన్‌ తో అల్లు అర్జున్‌!

allu arjun crazy combinatio

‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ షూటింగ్​తో బిజీగా ఉన్న ఆయన నెక్స్ట్​ లైనప్​ గురించి టాలీవుడ్​ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్​గా మారింది. గత కొద్ది రోజులుగా అట్లీ అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా అది దాదాపుగా కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళితే.. డైరెక్టర్‌ అట్లీ తాజా​గా ‘జవాన్’ సినిమాతో భారీ హిట్​ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల మోత మోగిస్తూ దుసుకెళ్తోంది. ఇదే సమయంలో అట్లీ .. తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్​తో కలిసి చేస్తారన్న టాక్​ కూడా ఎక్కువగా వినిపిస్తోంది. కానీ అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు. అయితే తాజాగా అల్లు అర్జున్​ చేసిన ఓ ట్వీట్​తో ఈ టాపిక్​ మరోసారి తెరపైకి వచ్చింది. ‘జవాన్’ సక్సెస్​పై బన్నీ స్పందిస్తూ మూవీటీమ్​కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. హీరో షారుక్ ఖాన్​తో పాటు విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్​​, దర్శకుడు అట్లీని పేరు పేరున కొనియాడారు.

అయితే ఈ ట్వీట్​పై సంగీత దర్శకుడు అనిరుధ్ ‘థాంక్యూ మై బ్రో’ అంటూ రియాక్ట్ అయ్యాడు. దానికి బన్నీ.. ‘థాంక్యూ సరిపోదు.. నాకు మంచి పాటలు కావాలి’ అంటూ అనిరుధ్​ ట్వీట్​కు బదులిచ్చారు. ఈ ట్వీట్​ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అట్లీ-అర్జున్-అనిరుధ్(AAA) కాంబో కన్ఫామ్​ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రూమర్స్​ అనుకుంటున్న ఈ విషయాన్ని బన్నీ రిప్లైతో కన్ఫామ్​​ చేసేశారంటూ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నాడు. తర్వాత సందీప్​ వంగతో చేయనున్నారు. ఆ తర్వాతే అట్లీతో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu