HomeTelugu Newsబన్నీ కూతురు 'ఫసక్‌' డైలాగ్‌ వైరల్‌

బన్నీ కూతురు ‘ఫసక్‌’ డైలాగ్‌ వైరల్‌

11 9

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటాడో అందరికి తెలిసిందే. పలు సందర్భాల్లో బన్నీ తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ తన కూతురు అర్హతో కలిసి అల్లరి చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. అర్హతో బన్నీ ‘ఫసక్‌’ చెప్పిస్తున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. తొలుత అర్హ డోంట్‌ సో మెనీ లైక్‌ దిస్‌ అంటే.. ఆ తర్వాత బన్నీ ఓన్లీ వన్స్‌ ఫసక్‌ అని అర్హతో చెప్పిస్తాడు. అర్హ క్యూట్‌ క్యూట్‌గా డైలాగ్‌ చెప్పిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!