
Sitaare Zameen Par First Review:
ఆమిర్ ఖాన్ మళ్లీ వచ్చేశారు! సితారే జమీన్ పర్ అనే సినిమా తీసుకువచ్చారు. మూడు సంవత్సరాల తర్వాత బిగ్ స్క్రీన్ మీద ఆమిర్ కనిపించబోతున్నారు కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. జూన్ 20న సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇందులో హీరోయిన్‌గా చాలా రోజుల తర్వాత జెనీలియా డిసోజా కనిపించనుందంటే ఆనందించాల్సిందే!
ఇది కామన్ సినిమా కాదండీ. కథ మొత్తం ఆటిజం, డౌన్ సిండ్రోమ్ ఉన్న పెద్దల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఆమిర్ ఈ సినిమాలో ఒక కోచ్ పాత్రలో నటించారు. మొదట్లో కోపంగా ఉంటాడు, కానీ ఈ ప్రత్యేక అవసరాలు ఉన్నవాళ్లను ట్రైన్ చేస్తూ అతని జీవితమే మారిపోతుంది. ఎమోషన్, మోటివేషన్, సోషల్ మెసేజ్ – అన్నీ కలిపి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తోందీ సినిమాకి వచ్చిన రివ్యూస్ చూస్తే.
సచిన్ టెండూల్కర్ కూడా ముందుగా చూసి “ఎమోషనల్ జర్నీ, అందరికీ కావల్సిన సందేశాలు ఉన్న సినిమా” అన్నారు. ఇంకొంతమంది సినీ విమర్శకులు కూడా సినిమా చూసిన తర్వాత “నవ్విస్తుందీ, ఏడిపిస్తుందీ, చివరికి మన హృదయాన్ని తాకుతుందీ” అన్నారు.
ఇన్ని ప్రాథమిక రివ్యూస్ చూస్తుంటే, ఇది ఆమిర్ ఖాన్ స్టైల్‌లో మరో బ్లాక్‌బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. “తారే జమీన్ పర్” సినిమా ఎమోషనల్ టచ్ మళ్లీ కనిపిస్తోంది.
ALSO READ: Tollywood సినిమాలపై OTT జులుం.. ఇక మారదా?