HomeTelugu Trendingతాతగారి ఊరికి బన్నీ భారీ విరాళం..!

తాతగారి ఊరికి బన్నీ భారీ విరాళం..!

8 11ఎటువంటి విపత్తులు వచ్చిన ముందుండి సహాయం చేస్తుంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ పరిశ్రమలో ముందుగా, ఎక్కువగా స్పందించే వ్యక్తుల్లో అల్లు అర్జున్ ఒకరు. ఫలానా పని చేస్తున్నాము.. తోచినంత సహాయం చేయమని అడిగితే.. కాదనకుండా చేస్తారు అల్లు అర్జున్. ఎన్నోమార్లు ఆయన సహాయ సహకారాలు అందించారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ తన తాతగారి ఊరైన పాలకొల్లులో పర్యటిస్తున్నారు. సంక్రాంతి ఉత్సవాలను అక్కడే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పాలకొల్లు పట్టణంలో పర్యటించారు. పాలకొల్లులో నిర్మించబోతున్న కళ్యాణ మండపానికి తనవంతు సహాయంగా రూ.10 లక్షల రూపాయలను ప్రకటించారు అల్లు అర్జున్. నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా తరువాత బన్నీ చాలా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నది.

8a

Recent Articles English

Gallery

Recent Articles Telugu