మేడమ్‌ టుస్సాడ్స్ లో సన్నీలియోన్‌ మైనపు విగ్రహం

ఫోర్న్‌ స్టార్‌ నుంచి బాలీవుడ్‌ నటిగా మారిన సన్నీలియోన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమెకూ స్థానం లభించింది. ఆమె రూపంలో ఓ మైనపుబొమ్మ వెలిసింది. తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించిన సన్నీ ఆ విశేషాలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. విశిష్టమైన మేడం టుసాడ్ మ్యూజియంలో తన బొమ్మను తాను చూసుకోవడం ఎంతో అద్భుతుమైన అనుభూతిని కలిగించిందని సన్నీ తెలిపింది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, షారుక్‌ఖాన్‌ల వంటి తదితర ప్రముఖ నటుల సరసన సన్నీ నిలిచింది.