HomeTelugu Trendingబాలీవుడ్‌ సినిమాలో గెస్ట్ రోల్‌లో బన్నీ!

బాలీవుడ్‌ సినిమాలో గెస్ట్ రోల్‌లో బన్నీ!

Allu arjun guest role in he
టాలీవుడ్‌ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా ‘పరుగు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో ‘హీరో పంతి’ పేరుతో రీమేకైన సంగతి తెలిసిందే. స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ఈ సినిమాతో అక్కడ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. టైగర్ కూడా ఈ సినిమా సీక్వెల్ కు ఒకే చెప్పాడట. స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు మూవీయూనిట్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ అతిథి పాత్రలో చేస్తే బాగుంటుందని ఆ మూవీ మేకర్ సాజిద్ బన్నీని సంప్రాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరో వైపు తెలుగులో కూడా ‘పరుగు’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు టాక్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu