HomeTelugu Trending'ఐకాన్' ముహూర్తం ఫిక్స్‌

‘ఐకాన్’ ముహూర్తం ఫిక్స్‌

Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మొదటి భాగం పూర్తి చేసిన అనంతరం ‘ఐకాన్’ షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్నారు. తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా పూజా కార్యక్రమాలను విజయదశమి రోజున ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే, కృతి శెట్టి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు ఉన్నాయి. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

బన్ని హీరోగా నటిస్తున్న ‘పుష్ప పార్ట్‌ 1’ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేస్తారని వినికిడి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu