HomeTelugu Trendingఎన్టీఆర్‌కు విలన్‌గా విజయ్‌ సేతుపతి!

ఎన్టీఆర్‌కు విలన్‌గా విజయ్‌ సేతుపతి!

Vijay Sethupathi as the vil
యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ప్రస్తుతం ‘RRR’ సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఎన్‌టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు. వీరి కాంబోలో రానున్న సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తిన’కు అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటుల విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముగ్గురు భామల పేర్లు వినిపిస్తున్నాయి. తాజగా ఈ సినిమాలో విలన్ పాత్ర విషయంలో కూడా వార్తలు చర్చ మొదలైంది.

తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా చేయనున్నారన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఎన్‌టీఆర్ సినిమాలో విజయ్ చేయనున్నాడన్న దానిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలో ఈ విషయంపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి. ఈ వార్త కనుక నిజమయితే ఎన్‌టీఆర్ 30 అభిమానులు అంచనాలను మించుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu