HomeTelugu Big Storiesబాలీవుడ్‌ ఎంట్రీకి ఓకే చెప్పిన అల్లు అర్జున్‌!

బాలీవుడ్‌ ఎంట్రీకి ఓకే చెప్పిన అల్లు అర్జున్‌!

Allu arjun planning for bol

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి స్పందన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాన అక్రమ రవాణా గంధపు చెక్కల నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అన్ని భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు బాలీవుడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా గురించి భారీ అంచనాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బన్నీ బాలీవుడ్ పై కన్నేసినట్లు తెలుస్తోంది.

గతంలో బన్నీకి బాలీవుడ్ నుండి పలు అవకాశాలు రాగా.. డేట్స్ కుదరక పోవడంతో బాలీవుడ్ లో అవకాశాలని వదులుకున్నాడు. కానీ ప్రస్తుతం పుష్ప విడుదలకు ముందే బాలీవుడ్ పై ఆసక్తి చూపుతున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్‌లో ఓ సినిమానే ఓకే చేయించుకోవాలని అనుకుంటున్నాడట. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమా కోసం ఇటీవల ఇద్దరు ప్రముఖ దర్శకులతో ఒప్పందాలు కూడా జరిగాయని తెలుస్తుంది.

మొత్తానికి సరైన టైమ్‌లో పుష్ప తో మరింత క్రేజ్ అందుకోవడానికి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే బన్నీ పుష్ప తర్వాత కొరటాల డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!