భారతీయుడుతో స్టార్‌ హీరోలు!

విలక్షణ నటుడు కమల్ హాసన్‌, ఇండియన్‌ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‌లో భారతీయుడు సీక్వెల్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. లాంగ్‌ గ్యాప్‌ తరువాత శంకర్‌, కమల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కావటంతో భారతీయుడు-2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్‌ కాస్టింగ్‌ను రెడీ చేస్తున్నాడు శంకర్‌. ఇప్పటికే కమల్‌ తో పాటు హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ను ఫైనల్‌ చేశారు. ఈ సినిమాలో కమల్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్నవార్తుల వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్‌ హీరో శింబుతో పాటు నయా సెన్సేషన్‌ దుల్కర్‌ సల్మాన్‌ కూడా నటించనున్నారట.

ప్రస్తుతానికి శింబు, దుల్కర్‌ పాత్రలపై అధికారిక ప్రకటన రాకపోయినా భారతీయుడు 2లో ఈ స్టార్స్‌ కనిపించటం దాదాపుగా కన్ఫామ్‌ అయినట్టుగా తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో విలన్‌ పాత్రలకు బాలీవుడు స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ను సంప్రదిస్తున్నారు.