HomeTelugu Trendingకేజీఎఫ్-2పై అల్లు అర్జున్‌ ప్రశంసలు

కేజీఎఫ్-2పై అల్లు అర్జున్‌ ప్రశంసలు

Allu arjun praises on kgf 2
కన్నడ హీరో యశ్ న‌టించిన తాజా చిత్రం ‘కేజీఎఫ్-2’. ఈ సినిమా భారీ విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ‘కేజీఎఫ్‌-2 సినిమా యూనిట్‌కు అభినంద‌న‌లు. ఈ సినిమాలో య‌శ్ న‌ట‌న అద్భుతం. సంజ‌య్ ద‌త్, రవీనా టాండన్, శ్రీ‌నిధి శెట్టి పాత్రలు అంద‌రినీ ఆకర్షించేలా ఉన్నాయి. సంగీత ద‌ర్శ‌కుడు రవి బస్రూర్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.

ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్లు అంద‌రికీ అభినంద‌న‌లు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ గారు సినిమాను రూపొందించిన తీరు చాలా బాగుంది. గొప్ప సినిమాను చూసిన అనుభ‌వాన్ని అందించినందుకు, భార‌తీయ సినిమాను శిఖ‌ర స్థాయిలో నిలిపినందుకు ఈ సినిమా యూనిట్‌కు కృత‌జ్ఞ‌త‌లు’ అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

గని’ ఫైనల్ కలెక్షన్స్..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu