HomeTelugu Trendingఅర్జున్‌ రెడ్డి లాంటి సినిమా నేను చేయలేను: అల్లుఅర్జున్‌

అర్జున్‌ రెడ్డి లాంటి సినిమా నేను చేయలేను: అల్లుఅర్జున్‌

4 7
అర్జున్ రెడ్డి సినిమాకి ఎంత క్రేజ్‌ వచ్చిందో అందరికి తెలుసు. ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీతో విజయ్ రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు అమ్మాయిలు సైతం బౌల్డ్ అయ్యారు. అర్జున్ రెడ్డిలో విజయ్ నటనకు చాలామంది సెలెబ్రిటీలు ఫ్యాన్ అయ్యారు.

అలాంటి వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. అర్జున్ రెడ్డిలో విజయ్ నటనకు ఫిదా అయినట్టు చెప్పిన బన్నీ, అటువంటి స్క్రిప్ట్ తన దగ్గరకు వస్తే మాత్రం నిర్మొహమాటంగా చేయను అని చెప్పేస్తానని అంటున్నాడు. అలాంటి బోల్డ్ సినిమాల్లో నటించడం తన వల్లకాదని అంటున్నాడు బన్నీ. ఇక విజయ్ ట్రెండీ డ్రెస్ లు చాలా బాగుంటాయని, వాటిని వేసుకోలేను అంటున్నాడు. బాలీవుడ్ రణ్వీర్ సింగ్ సైతం ట్రెండ్ ను ఫాలో అవుతుంటారని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu