కరోనా నుంచి కోలుకుంటున్నా: అల్లు అర్జున్‌


స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. బన్నీ తనకు కరోనా వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్ట్ చేసి అందరినీ జాగ్రత్తగా ఉండమని సూచించారు. తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. అయితే స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్న బన్నీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అలా ఐదారు రోజుల నుంచి బన్నీ క్వారంటైన్‌కు పరిమితయ్యారు. కానీ నిన్న మొన్న మాత్రం బన్నీ తన ఫ్యామిలీతో సరదాగా గడిపినట్టు కనిపిస్తోంది. ఇలా కరోనా వచ్చిన కూడా ఫ్యామిలీతో ఉంటున్నాడేంటి? అని అందరూ అనుకున్నారు. అయితే బన్నీకి కరోనా తగ్గిందా? అసలు ఏం జరుగుతోందని అందరూ ఆరా తీయడం ప్రారంభించారు.

అల్లు అర్హ, స్నేహ, అయాన్‌ల వీడియో షేర్ చేయడంతో బన్నీ ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని అంతా భావించారు. ఇదే విషయాన్ని బన్నీ కూడా తాజాగా తెలిపారు. అందరికీ హలో.. స్వల్ప లక్షణాలే ఉన్నాయి.. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది.. కరోనా నుంచి కోలుకుంటున్నాను.. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను.. మీరు చూపిస్తున్న ప్రేమకు, ప్రార్థనలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అని బన్నీ ఓ పోస్ట్ చేశారు.

Allu Arjun2

CLICK HERE!! For the aha Latest Updates