HomeTelugu Big Storiesబాలీవుడ్‌ బిగ్‌బీ- అభిషేక్‌లకు కరోనా

బాలీవుడ్‌ బిగ్‌బీ- అభిషేక్‌లకు కరోనా

1 10
బాలీవుడ్‌ నటుడు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ కరోనా బారిన పడ్డారు. ఇద్దరికీ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఐతే… అమితాబ్ భార్య జయా బచ్చన్, అభిషేక్ భార్య ఐశ్వర్యరాయ్‌కి రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చిందని తెలిసింది. పది రోజులుగా అనారోగ్యంతో ఉన్న అమితాబ్… ఎందుకైనా మంచిదని… జులై 11న నానావతి హాస్పటల్ లో చికిత్స చేయించుకుంటున్నారు . తనకు కరోనా సోకిందని బిగ్ బీ చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా… పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్‌ ద్వారా శనివారం రాత్రి తెలిపాడు. ఇవాళ నాకు, నా తండ్రికి కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. ఇద్దరికీ స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఇద్దరం ఆస్పత్రిలో చేరాం. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరుతున్నాను. ధన్యవాదాలు” అని అభిషేక్ తెలిపాడు.

అటు అమితాబ్ బచ్చన్ 77 ఏళ్ల వయసులో కరోనా బారిన పడినట్లు శనివారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత 10 రోజులుగా తనను కలిసినవారంతా… కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. తండ్రీ కొడుకు త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu