HomeTelugu Trendingఇన్‌స్టాగ్రామ్‌తో కలిసి బన్నీ స్పెషల్ వీడియో

ఇన్‌స్టాగ్రామ్‌తో కలిసి బన్నీ స్పెషల్ వీడియో

Allu Arjun special video wi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌తో కలిసి ఓ స్పెషల్ వీడియో చేశారు. అందులో తన ఒక రోజు దినచర్యను చూపించాడు. ఉదయం లేచినప్పటి నుంచీ షూటింగ్ ముగిసే వరకూ తాను ఏయే పనులు చేస్తాడో ఆ వీడియోలో బన్నీ వివరించాడు. పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న స్పాట్‌లోకి తీసుకెళ్లాడు.

పుష్ప 2 సెట్స్ లోకి తీసుకెళ్లే ముందు తన ఇంట్లోనూ అర్జున్ ఓ టూర్ వేసి చూపించాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్, అక్కడ మూవీ కోసం వేసిన సెట్స్, తన కాస్ట్యూమ్స్, డైరెక్టర్ సుకుమార్, మూవీ షూటింగ్.. ఎలా జరుగుతుంది ఇదంతా ఈ వీడియోలో చూపించారు.

“సెట్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ ఉదయాన్నే కాస్త చిల్ అవుతాడు” అంటూ ఈ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ వీడియోలో బన్నీ చేసిన కామెంట్స్ ను కూడా క్యాప్షన్ రూపంలో చెప్పింది. “ఇండియాలో అభిమానులు చాలా భిన్నం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది కనిపించదు. మీరు చూడాల్సిందే. దీనిని వర్ణించలేం” అంటూ తాను ఫిల్మ్ సిటీలోకి ఎంటరవుతున్న సమయంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న అభిమానులను చూపిస్తూ అర్జున్ చెబుతాడు.

“హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇది. ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోల్లో ఇదీ ఒకటి. పుష్ప 2: ది రూల్ కు ఇదే ఇల్లు ఇప్పుడు” అని ఫిల్మ్ సిటీ గురించి అతడు వివరించాడు. అభిమానులే తనకు మోటివేషన్ అని, వాళ్ల ప్రేమే తాను తన సరిహద్దులను చెరిపేస్తూ ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తోందని అన్నాడు. ఇదే వీడియోలో డైరెక్టర్ సుకుమార్ కూడా మాట్లాడాడు.

పుష్ప 2 మూవీ షూటింగ్ ఎలా సాగుతుందో కూడా ఈ వీడియోలో చూపించారు. మూవీ కోసం వేసిన సెట్స్, అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్, అతడు సెట్లోకి ఎంటరయ్యే విధానం, యాక్షన్ నుంచి కట్ వరకూ షూటింగ్ సాగే తీరును ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియోను లక్షల మంది లైక్స్, షేర్స్ చేస్తున్నారు.

పుష్ప 2 మూవీ వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పుష్ప మూవీ కోసం ఈ మధ్యే నేషనల్ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్

Recent Articles English

Gallery

Recent Articles Telugu