దివ్యాంగులతో బన్నీ ఫొటో .. వైరల్‌

తాజాగా అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ మూవీ ఓపెనింగ్ సందర్భంగా అభిమానులను ఆప్యాయంగా దగ్గర తీసుకొని వారితో కలిసి ఫొటోలు దిగుతున్నారు. తన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకొని బయలుదేరిన బన్నీకి రోడ్డు మీద ఇద్దరు దివ్యాంగులు తనకు అభివాదం చేస్తూ కనిపించారు. వెంటనే స్పందించిన బన్నీ.. కారు ఆపి వారిని పలకరించాడు, వారి కోరిక మేరకు వారితో కలిసి ఫొటో దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టైలిష్ స్టార్‌ అభిమానులు ఈ ఫొటోను షేర్‌ చేస్తూ పొంగిపోతున్నారు.