HomeTelugu Trendingబన్నీ సినిమా టైటిల్‌ లీక్‌?

బన్నీ సినిమా టైటిల్‌ లీక్‌?

13 4

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురం’ లో సినిమాతో సూపర్‌ హిట్ అయింది. కాగా.. బన్నీ ప్రస్తుతం సుకుమార్ తో సినిమాను ప్లాన్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగం గా జరుగుతున్న నేపథ్యంలో కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. గతంలో బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్యా 2 మంచి విజయం సాధించడం తో ఈ సినిమా కూడా విజయం సాధించి ఈ కాంబో హ్యాట్రిక్ కొడతారని ఫ్యాన్స్‌ అంటున్నారు.

ఇక బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఓ సర్ఫరైజ్ ను ప్లాన్ చేసాడు సుకుమార్. ఏప్రిల్ 8 ఉదయం 9 గంటలకు అప్‌డేట్ ఉంటుందని సోమవారం మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే మేకర్స్ ఇవ్వబోతున్న అప్‌డేట్ ముందుగానే లీక్ అవ్వడంతో అల్లు అర్జున్‌తో పాటు చిత్రయూనిట్ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేద్దామనుకున్నారు. ఈ లోగా సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ లీక్ షికారు చేస్తుంది. బన్నీ బర్త్‌డేకి ఒకరోజు ముందే ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా లీక్ చేశారు. అయితే ఈ లీక్‌పై చిత్రయూనిట్ చాలా సీరియస్‌గా ఉంది. అసలు ఈ చిత్రానికి మొదటి నుంచి ‘శేషాచలం’ అనే పేరు వినబడింది. కానీ ఈ చిత్రంలో బన్నీ పాత్ర పేరు ‘పుష్పక్ నారాయణ’. దీనిలో నుంచే ‘పుష్ప’ అనే టైటిల్‌ను సుకుమార్, అల్లు అర్జున్ ఫైనల్ చేశారు. మరి ఈ లీక్ లో ఎంత వరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu