HomeTelugu Big Stories‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్.. హీరో ఎవరంటే..

‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్.. హీరో ఎవరంటే..

6 7

డైరెక్టర్‌ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్‌గా హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 150 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ఈ చిత్రాన్ని ఇపుడు హీందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌… తాజాగా డిజిటల్ శాటిలైట్ హక్కులను జెమిని వాళ్లు భారీ రేటుకే కొనుగోలు చేసారు.

ఈసినిమా రీమేక్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రూ.8 కోట్లకు కైవసం చేసుకున్నాడు. ఈ చిత్రం సాధించిన విజయం చూసి సల్మాన్ ఖాన్.. ‘అల వైకుంఠపురములో’ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడట. అంతేకాదు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నడట. గత కొన్నేళ్లుగా సల్మాన్ ఏ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయడం లేదు. అందుకే ఈ రీమేక్ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఈ హిందీ రీమేక్‌లో బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు మరో క్రేజీ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు హిందీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట.

6

Recent Articles English

Gallery

Recent Articles Telugu