శాతకర్ణి కోసం మరోస్టార్ హీరో!

బాలకృష్ణ 100వ చిత్రంగా రూపొందుతోన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై రోజు రోజుకి అంచనాలు
పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎనబై శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్
హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను
అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు శ్రియ, హేమమాలిని వంటి వారు
నటిస్తున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు టాక్. కన్నడంలో
స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్న శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో ఈ సినిమాలో
కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సంక్రాంతికి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.