డి.జె కోసం శాఖాహారిగా మారాడు!

ఏ సినిమా చేయడానికైనా.. తనవంతు పూర్తి బాధ్యతను అందిస్తాడు అల్లు అర్జున్. అందుకే తన కెరీర్ లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. రీసెంట్ గా తను నటిస్తోన్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుండి అల్లు అర్జున్ లుక్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో కేటరింగ్ చేసే బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఎలాంటి జోక్స్ కానీ కామెంట్స్ కానీ ఉండవని చిత్రబృందం చెబుతోంది.
దర్శకుడు హరీష్ శంకర్ బ్రాహ్మణ జాతికి చెందిన వారే.. ఈ సినిమా కూడా బ్రాహ్మణులు గర్వపడే విధంగా తీర్చుదిద్దుతున్నారని సమాచారం. ఈ సినిమా ఓకే అనుకున్నప్పటినుండి అల్లు అర్జున్ పాత్రలో ఇమిడిపోవాలనే ఆలోచనతో ఆరు నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉన్నారట. తన పాత్ర పట్ల బన్నీ అంత డెడికేషన్ చూపిస్తారనడానికి మరో ఉదాహరణ ఇది. మరి ఈ కేటరింగ్ బిజినెస్ తో బన్నీ ప్రేక్షకులను ఎంతగా ఎంటర్టైన్ చేస్తాడో… చూడాలి!