HomeTelugu Newsఅల్లు శిరిష్‌ బర్త్ డే సెలబ్రేషన్స్..

అల్లు శిరిష్‌ బర్త్ డే సెలబ్రేషన్స్..

7 28అల్లు శిరీష్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా కుటుంబం అంతా కలిసింది. అందరూ కలిసి శిరీష్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి అల్లు బాబీ, అల్లు అర్జున్ దంపతులు కూడా హాజరయ్యారు. పిల్లలు, మనవళ్లతో కలిసి శిరీష్ పుట్టిన రోజును తన ఇంట్లోనే సెలబ్రేట్ చేసాడు అల్లు అరవింద్. మరిది కోసం ప్రత్యేకంగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇంట్లోనే కేక్ తయారు చేసింది. ఇక కుటుంబ సభ్యులందరి సమక్షంలో కేక్ కట్ చేశాడు శిరీష్‌.

ఇక లాక్‌డౌన్ నేపధ్యంలో కూడా తన కుటుంబం అంతా కలిసి ఇలా పుట్టిన రోజు సెలబ్రేట్ చేయడం మరిచిపోలేనని.. అద్భుతంగా అనిపించిందని చెప్పాడు శిరీష్. ఇదే విషయాన్ని అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వాళ్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఈయన కొత్త సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. అందుకే లుక్ కూడా మార్చేశాడు శిరీష్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu