HomeTelugu Trendingఅక్కినేని అమల న్యూ బాలీవుడ్‌ మూవీ 'తుమ్ సే నా హో పయేగా'

అక్కినేని అమల న్యూ బాలీవుడ్‌ మూవీ ‘తుమ్ సే నా హో పయేగా’

amala in tumse na ho payega
అక్కినేని అమల నటించిన తాజా బాలీవుడ్‌ మూవీ ‘తుమ్ సే నా హో పయేగా’. పాతాల్ లోక్, మేడ్ ఇన్ హెవెన్, రాకెట్ బాయ్స్ వంటి చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకున్న ఇష్వాక్ సింగ్ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్ గమ‌నిస్తే.. ఇష్టంలేని బోరింగ్ జాబ్ చేస్తున్న కొంతమంది కుర్రాళ్లు.. ఆ జాబ్స్ మానేసి సొంత బిజినెస్ చేయాలి అనుకుంటారు. అయితే వారికి బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎదురైనా సమస్యలు ఏంటి అనేది ఈ స్టోరీ. ఇక దేశంలోని అన్ని మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న సమస్యను చెప్పాలనేదే ఈ చిత్రం వెనుక ఉన్న ఆలోచన అని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 29 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదిక‌గా స్ట్రీమింగ్ కానుంది.

స్టార్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, అశ్వినీ అయ్యర్ తివారీ, నితేష్ తివారీ ఈ సినిమాను నిర్మించ‌గా.. అభిషేక్ సిన్హా దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌ నితేష్ తివారీ ఈ సినిమాకు క‌థ, డైలాగ్స్ అందించాడు. అక్కినేని అమల, ఇష్వాక్ సింగ్‌తో పాటు మహిమా మక్వానా, గౌరవ్ పాండే, గురుప్రీత్ సైనీ, కరణ్ జోత్వాని, మేఘనా మాలిక్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu