అమలాపురం టీడీపీ అభ్యర్థి హర్షకుమార్?

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్ సభ స్థానానికి మాజీ ఎంపీ హర్షకుమార్ పేరును పరిశీలిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ హర్ష కుమార్ భేటీ కానున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన హర్షకుమార్… ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. అమలాపురం లోక్ సభకు హర్ష కుమార్ పేరు ఖరారైతే అమలాపురం అసెంబ్లీ నుంచి జీఎంసీ హరీష్ మాధూర్ పేరు ఫైనల్ చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో పనబాక దంపతులు కూడా భేటీ కానున్నారు. తిరుపతి లోక్ సభ స్థానాన్ని ఆశిస్తున్న పనబాక ఫ్యామిలీ… దీనిపై చంద్రబాబుతో చర్చలు జరపనున్నట్టు సమాచారం.