HomeTelugu Trending‘పక్కాకమర్షియల్‌’ టీజర్

‘పక్కాకమర్షియల్‌’ టీజర్

Pakka Commercial Teaser
హీరో గోపీచంద్‌ నటించిన తాజా చిత్రం ‘పక్కాకమర్షియల్‌’. మరుతి డైరెక్షన్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాకి బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ టీజర్‌లో గోపీచంద్‌లోని యాక్షన్‌ కోణాన్ని.. కామెడీ యాంగిల్‌ని స్టైలిష్‌గా చూపించారు. ‘‘ఎవరికి చూపిస్తున్నారు సర్‌ మీ విలనిజం. మీరిప్పుడు చేస్తున్నారు. నేనెప్పుడో చేసి.. చూసి.. వచ్చేశా’’ అంటూ టీజర్‌లో గోపీచంద్‌ చెప్పిన డైలాగ్‌ ఆసక్తిరేకెత్తించేలా ఉంది.

ఈ చిత్రంలో గోపీచంద్‌, రాశీ న్యాయవాదులుగా నటిస్తున్నారు. సత్యరాజ్‌, రావు రమేష్‌, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu