HomeTelugu Newsసైరా ట్రైలర్‌పై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్పందన

సైరా ట్రైలర్‌పై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్పందన

7 18
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా విశేష స్పందన వస్తోంది. భారీ యాక్షన్‌ విజువల్స్‌లో రూపొందించిన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. అభిమానుల నుంచే కాకుండా సినీ తారలు కూడా సైరా ట్రైలర్‌కు ఫిదా అయ్యారు.

ఇప్పటికే దర్శకుడు రాజమౌళి, హీరోలు నాని, మహేశ్‌ బాబు, విజయ్‌ దేవరకొండ, సల్మాన్‌ ఖాన్‌ ఈ ట్రైలర్‌ను మెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ కూడా సైరా ట్రైలర్‌ను చూసి ఫిదా అయ్యాడు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సైరా ట్రైలర్‌ బాగుంది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. చిరంజీవి సర్‌, రామ్‌ చరణ్‌ సర్‌ అండ్‌ చిత్ర బృందానికి ఆల్‌ ద బెస్ట్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ట్రైలర్‌లో గంభీరమైన
స్వరంతో చిరంజీవి చెప్పిన డైలాగులు మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. మెగాస్టార్‌ సరసన నయనతార నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, మిల్క్‌ బ్యూటి తమన్నా, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu