HomeTelugu Newsతెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

13 3

తెలంగాణలో ఇవాళ కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వచ్చినా ఇవాళ మళ్లీ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1163కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ కొత్తగా నమోదైన 31 కేసుల్లో 30 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 751 మంది డిశ్చార్చి అయ్యారు. ప్రస్తుతం మరో 382 మంది చికిత్సపొందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu