HomeTelugu Trendingఐశ్వర్య రాయ్‌పై బిగ్‌బీకి కోపమొచ్చిందా?

ఐశ్వర్య రాయ్‌పై బిగ్‌బీకి కోపమొచ్చిందా?

Amitabhబాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్య రాయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. బిగ్ బీ మొత్తం 74 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతారు.

అమితాబ్ ఫాలోవర్స్ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి స్టార్ల పేర్లు ఉన్నాయి. ఇందులో ఐశ్వర్య కనిపించకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అమితాబ్ మనవడు అగస్త్య నంద నటించిన ‘ది ఆర్చీస్’ ఇటీవలే విడుదలైంది. ముంబైలో ఈ చిత్రం ప్రీమియర్‌ షోకు అమితాబ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఐశ్వర్య, అమితాబ్ సహా అందరూ సంతోషంగా కెమెరాలకు పోజులిస్తూ కనిపించారు.

ప్రస్తుతం అమితాబ్ ఐశ్వర్యను అన్‌ఫాలో అయ్యారన్న వార్త వైరల్‌గా మారింది. కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. అమితాబ్ ఇన్‌స్టా ఖాతాలో సెట్టింగ్స్ కారణంగా ఆయన ఎవరిని ఫాలో అవుతోందీ బహిరంగంగా తెలియకపోవచ్చని కొందరు కామెంట్ చేశారు.

ఈ విషయం అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారన్న వార్త కూడా చక్కర్లు కొడుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu