HomeTelugu Trendingవర్మ 12' O క్లాక్ ట్రైలర్

వర్మ 12′ O క్లాక్ ట్రైలర్

RGV 12 oclock trailer

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కొత్త హారర్‌ సినిమా ’12’ O’ క్లాక్ ట్రైలర్ ఈ రోజు విడుదల అయింది. ఇది షార్ట్ ఫిలిం కాదని, పూర్తి స్థాయి సినిమా అని వర్మ ఇప్పటికే ప్రకటించారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని రుచి చూపేలా ఈ సినిమా తీసినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సైన్స్‌కు, ఆత్మలకు ఏదైనా సంబంధం ఉందా? అనే అంశంపై కథను నడిపించారు. ఈ సినిమాలో మకర్‌దేశ్‌ పాండే, మిథున్‌ చక్రవర్తి, ఆశిష్‌ విద్యార్థి, దిలీప్‌ తాహిల్‌, మానవ్‌ కౌల్‌, అలీ అజగర్‌, తదితరులు నటించారు. జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu