HomeTelugu Trendingబాలసుబ్రహ్మణ్యం పాత్రలో అమితాబ్‌!

బాలసుబ్రహ్మణ్యం పాత్రలో అమితాబ్‌!

Amitabh lead role in Midhun
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం మన మధ్యలో లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు శ్రోతలను అభిమానుల వెంటాడుతూనే ఉన్నాయి. ఇక ఆయన ముఖ్యపాత్రలో తనికెళ్ల భరణి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిథునం’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో లక్ష్మితో కలిసి ఆయన పండించిన నటనను మరచిపోలేం. ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఎస్పీ బాలు పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను థీమ్ యూనివర్సల్ కాబట్టి.. ఏ భాషలో తీసినా.. నేటివిటీ సమస్య ఉండదు. హిందీలో ఈ సినిమాను అమితాబ్ బచ్చన్.. తన నిజ జీవిత భాగస్వామి జయ బచ్చన్‌తో ఈ సినిమాలో కలిసి నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు బిగ్‌బీతో రేఖ నటించబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి అమితాబ్.. ఎవరితో ‘మిథునం’ సినిమాను రీమేక్ చేస్తాడనేది చూడాలి.

ఇప్పటికే ఎస్పీ బాలు నటించిన ‘మిథునం’ సినిమా రీమేక్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. హిందీలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. 2012లో విడుదలైన ఈ సినిమా పెద్ద విజయమే సాధించింది. ఇక హిందీ రీమేక్‌ను ఎవరు డైరెక్టర్‌, నిర్మత తదితర వ త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu