HomeTelugu Trendingభారత్‌ను వణికిస్తున్న 'కరోనా' వైరస్

భారత్‌ను వణికిస్తున్న ‘కరోనా’ వైరస్

6 1
చైనా నుంచి ప్రపంచ దేశాలను తాకుతూ కంటిపై ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్. ఈ మహమ్మారి ఇప్పుడు భారత్‌ను కూడా తాకడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు కరోనా వైరస్‌ గురించి మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. కరోనా వైరస్‌పై అధ్యయనం చేసిన లండన్‌కు చెందిన క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దానిపై ఓ ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ ప్రకటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దాని ప్రకారం కరోనా వైరస్ ఓ సారి వచ్చి వెళ్లిపోదని. ఈ వైరస్ సీజనల్ వ్యాధుల లాంటిదేనని తేల్చేసింది.

సీజన్ వ్యాధుల్లా ప్రతి ఏడాది కరోనా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించినట్టు చెబుతున్నారు. ప్రతి సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు, వంటివి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతాయని హెచ్చరిస్తున్నారు. కాగా, కరోనా వైరస్ ముఖ్యంగా దగ్గినప్పుడు ఎదుట వ్యక్తికి వస్తుంది. కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ కరోనా వైరస్ సోకుతుంది. గాలిలో కలిసి అంతటా వ్యాపించే అకాశం లేదు. కానీ, కరోనా వైరస్ ఉన్న వ్యక్తి వాడిన వస్తువులు తాకితే ఎటాక్ చేస్తోంది. కరోనా వైరస్‌ సోకినవారిని ప్రత్యేకంగా ఉంచాలి. వాళ్లను తాకిన తర్వాత చేతులు ముక్కు, ముఖం దగ్గర పెట్టుకోకపోతే ఎలాంటి వైరస్ రాదు. ఫ్లూ మాదిరిగా లక్షణాలు ఉంటాయి. సాధారణ ఫ్లూ అయితే చికిత్స తీసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కరోనాతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu