HomeTelugu Newsఅనసూయను సెలెక్ట్‌ చేసిన విజయ్..!

అనసూయను సెలెక్ట్‌ చేసిన విజయ్..!

17
పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర ధారిగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్న చిత్రంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించనుందట. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా పల్లెటూరి పాత్రలో అదరగొట్టిన అమ్మడి క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట విజయ్. తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఎక్కువ ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్స్ కొట్టిన విజయ్‌ లేటెస్ట్ గా ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించాడు. కింగ్‌ ఆఫ్ ది హిల్ అనే బ్యానర్‌పై సినిమాలు నిర్మించబోతున్నాడు.

తనకు హీరోగా బ్రేక్‌ ఇచ్చిన పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా పెట్టి సినిమా నిర్మిస్తున్నాడు విజయ దేవరకొండ. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. ఈ సినిమాలో అనసూయను ప్రధాన పాత్రకు ఎంపిక చేశాడట విజయ్. దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్న తరుణ్ భాస్కర్.. విజయ్‌ సినిమాతో హీరో అవ్వడం రంగమ్మత్తగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుని కెరీర్‌ను పరిగెత్తిస్తున్న అనసూయ అతని సరసన నటించడం ప్రాజెక్టుపై క్రేజ్‌ను పెంచాయి. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు నటీనటులు కనిపించబోతున్నారట. ఈ నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుందట. హీరోగా మెప్పించిన దేవరకొండ ఈసినిమాతోనూ నిర్మాతగా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu