ఎన్టీఆర్, నాగ్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది!

నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో దాదాపు 28 ఏళ్ల క్రితం ‘శివ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోతుంది. ఈ నెల 20 నుండి సినిమాను మొదలుపెట్టనున్నారు. వర్మ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా టబుని ఎంపిక చేయనున్నారని సమాచారం.

గతంలో నాగార్జున, టబు జోడీగా నటించిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు మరోసారి ఈ జంట తెరపై కనువిందు చేయనుంది. అలానే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కీలక పాత్ర కోసం టబుని ఎంపిక చేశారట. ఆమె పాత్రను స్పెషల్ గా రాసుకున్నట్లు తెలుస్తోంది.

సీనియర్ హీరోయిన్లతో తన సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేయించడం త్రివిక్రమ్ కు అలవాటే. ఆ పాత్రలు కూడా వారికి మంచి పేరును తీసుకొచ్చాయి. ఇప్పుడు టబుకి అటువంటి అవకాశం దక్కింది. మొత్తానికి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ కొట్టేసింది!