HomeTelugu Trendingమైఖేల్‌: అనసూయ ఫస్ట్‌లుక్‌ విడుదల

మైఖేల్‌: అనసూయ ఫస్ట్‌లుక్‌ విడుదల

anasuya look from michael
యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘మైఖేల్’. విజయ్‌ సేతుపతి మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మైఖేల్‌ టీజర్‌, నీవుంటే చాలు సాంగ్ లిరికల్ వీడియో సాంగ్‌ మూవీ లవర్స్ ను ఇంప్రెస్‌ చేస్తోంది. ఇటీవలే మైఖేల్‌ షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో మైఖేల్‌ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా నుంచి అనసూయ భరద్వాజ్‌ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

అనసూయ భరద్వాజ్‌ మైఖేల్‌ చిత్రంలో చారులతగా కనిపించనుంది. నలుపు రంగు చీరలో మ్యాడ్‌ క్వీన్‌గా అగ్రెసివ్‌ లుక్‌లో కనిపిస్తుంది అనసూయ. మైఖేల్‌లో గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, వరుణ్‌ సందేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నాడు. మైఖేల్‌లో దివ్యాంక కౌశిక్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది.

ఈ చిత్రాన్ని రంజిత్‌ జయకోడి డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, క‌ర‌ణ్ సి ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్లపై పీ రామ్‌మోహ‌న్ రావు, భ‌ర‌త్ చౌద‌రీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైఖేల్‌ తెలుగు,తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 3న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu