అనసూయ ‘థాంక్యూ బ్రదర్‌’ మోషన్‌ పోసర్ట్‌


తెలుగు హాట్‌ యాంకర్‌ అన‌సూయ గర్భిణిగా నటిస్తోన్న చిత్రం ‘థాంక్యూ బ్ర‌ద‌ర్’. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ ను ఈ రోజు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు విడుదల చేశారు. లిఫ్టులో అనసూయ, అశ్విన్ ఇరుక్కుపోయి ప్రాణభయంతో ఉన్నట్లు ఈ లుక్ లో చూపించారు. వారిద్దరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లుగా మ్యూజిక్ వినిపించారు. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంలో మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ర‌మేశ్ రాప‌ర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఈ లుక్ చాలా థ్రిల్లింగ్ గా ఉందని చెప్పారు. మహేశ్ బాబు ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేసినందుకు గానూ ఆయనకు చిత్ర యూనిట్ థాంక్యు చెప్పింది. అనసూయ కూడా దీనిపై స్పందిస్తూ ‘థాంక్యూ మహేశ్ బాబు సర్’ అని పేర్కొంది.

CLICK HERE!! For the aha Latest Updates