12 కేజీలు బరువు పెరిగిన బ్యూటీ!

సినిమాల కోసం బరువు పెరగడం, తగ్గడం హీరోయిన్లకు సాధారణమే. అయితే యాంకర్ అనసూయ ఐటెమ్ సాంగ్ కోసం సుమారు 12 కిలోల బరువు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాయి ధరం తేజ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తోన్న ‘విన్నర్’ సినిమాలో అనసూయ ఐటెమ్ సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ఐటెమ్ సాంగ్ చేసే అమ్మాయి కాస్త బొద్దుగా ఉండాలని డైరెక్టర్ చెప్పగా దాన్ని తప్పక పాటించాలని అనసూయ తన శరీరబరువుని పెంచుకుంది. ఈ పాట కోసం అనసూయ అంత రిస్క్ చేయడానికి మరొక కారణం కూడా ఉంది. ఈ ఐటెమ్ సాంగ్ అనసూయ పేరుతోనే మొదలవుతుందట.

తన పేరు మీద ఉండే ఐటెమ్ సాంగ్ కాబట్టి తన కెరీర్ కు ఈ సాంగ్ కచ్చితంగా ప్లస్ అవుతుందని భావించి ఇంత రిస్క్ తీసుకుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ పాట కోసం అమ్మడుకి భారీ పారితోషికం ముట్టజెప్పినట్లు టాక్. మరి తన బొద్దుగా ఉండే లుక్ తో ఈ భామ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో.. చూడాలి!