HomeTelugu Trendingహాస్పిటల్ బెడ్ పై యాంకర్ లాస్య.. వైరల్‌

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ లాస్య.. వైరల్‌

Anchor lasya hospitalised

తెలుగు యాంకర్‌ లాస్య గురించి ప్రత్యేకంగా ప్రత్యేకించి చెప్పనసరం లేదు. చీమ ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపుల‌ర్ అయింది. బిగ్‌బాస్‌ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కొంతకాలంగా బుల్లితెరకు గ్యాప్‌ ఇచ్చిన లాస్య తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అలరిస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. అయితే తాజాగా లాస్య హాస్పిటల్‌ పాలైంది.

ఈ విషయాన్ని స్వయంగా లాస్య భర్త మంజునాథ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారు. దీంతో యాంకర్‌ లాస్యకు ఏమైందంటూ ఆమె ఫ్యాన్స్‌ కంగారు పడుతున్నారు. లాస్య హాస్పిటల్‌లో ఎందుకు చేరిందన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu