HomeTelugu Trending'సాహో' రొమాంటిక్‌ పోస్టర్‌ విడుదల

‘సాహో’ రొమాంటిక్‌ పోస్టర్‌ విడుదల

2 22
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా నుంచి కొత్త పోస్టర్‌ విడుదలైంది. పోస్టర్‌లో శ్రద్ధ.. ప్రభాస్‌ను ప్రేమగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ ఒక్కటి కూడా విడుదల కాలేదు. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తైంది. జిబ్రాన్‌ సంగీతం అందించారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. భారతీయ తొలి భారీ యాక్షన్‌ చిత్రంగా దీనిని తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు రూ.150 కోట్లతో సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల 30కి వాయిదా పడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu