ఎన్టీఆర్‌కు చాలెంజ్‌ విసిరిన సుమ

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. హరిత ఉద్యమంలో భాగంగా సినీనటి జయసుధ చేసిన సవాల్‌ను స్వీకరించిన సుమ బుధవారం బేగంపేటలో మొక్కలు నాటారు. అశోక, వేప, కదంబం మొక్కలు నాటిన ఆమె ఎన్టీఆర్‌తో పాటు నటి మంచులక్ష్మీ, బిగ్‌బాస్‌ సీజన్‌ 3 విజేత రాహుల్, బుల్లితెర వ్యాఖ్యాత ఓంకార్‌లకు గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. కాగా, హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ గ్రీన్‌ చాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటారు. అంతేకాకుండా వారు మరికొంత మందికి గ్రీన్‌ చాలెంజ్‌కు నామినేట్‌ చేశారు.