HomeTelugu Trendingసుమ కొడుకు రోషన్‌ ఫొటోలు వైరల్‌

సుమ కొడుకు రోషన్‌ ఫొటోలు వైరల్‌

Anchor suma son pics viral

స్టార్‌ యాంక‌ర్ సుమ కొడుకు రోషన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీటిని సుమ త‌న ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. సుమ, రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ ఇప్పటికే ‘నిర్మల కాన్వెంట్‌’ అనే సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో కలిసి ఓ పాత్రలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత‌ అమెరికాలో చ‌దువు ముగించుకుని ఇటీవల భార‌త్ కి తిగిగొచ్చాడు.

ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించాడు. అత‌డిని సినిమాల్లో సెట్ చేసేందుకు సుమ, రాజీవ్‌ ప్రయత్నిస్తున్నారు. రోష‌న్ కోసం సొంతంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రోషన్ తో ప‌లు ఫొటోలు దిగిన సుమ వాటిని పోస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. నిన్న రోష‌న్ పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకున్నాడు. దీంతో అత‌డికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ ఫొటోలను సుమ పోస్ట్ చేసింది.

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ క్లోజింగ్ కలెక్షన్స్..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu