HomeTelugu Trendingరౌడీ హీరో న్యూలుక్‌.. వైరల్‌

రౌడీ హీరో న్యూలుక్‌.. వైరల్‌

Vijay deverakonda new look

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ రింగుల జుట్టుతో, సిక్స్ ప్యాక్ బాడీతో బాక్సర్ మేకోవర్ లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నాడు. గత రెండేళ్లుగా ఒకే స్టైల్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు సరికొత్త లుక్ లో మరింత హ్యాండ్సమ్ గా కన్పించాడు. టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ విజయ్ దేవరకొండ ‘లైగర్’ కోసం ఇన్నాళ్లూ పొడవాటి జుట్టుతో కన్పించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రైమ్ వాలీబాల్ లీగ్ కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో విజయ్ కనిపించాడు. ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఆయన న్యూలుక్ అందరి దృష్టిని ఆకర్షించింది.

తల్లి మాధవితో కలిసి ఆయన వాలీబాల్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నాడు. విజయ్ దేవరకొండ న్యూ లుక్ ను చూసిన నెటిజన్లు తన తరువాతి సినిమా ‘జన గణ మన’ కోసమే ఈ మేకోవర్ అంటున్నారు. విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో నటించగా.. అనన్య పాండే హీరోయిన్‌గా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu