HomeTelugu Trendingబాలయ్యతో.. అనిల్‌ రావిపూడి.. 108 మూవీ ఫిక్స్‌

బాలయ్యతో.. అనిల్‌ రావిపూడి.. 108 మూవీ ఫిక్స్‌

Anil ravipudi movie with ba
నందమూరి బాలకృష్ణ ‘108వ’ సినిమా అప్ డేట్ వచ్చేసింది. ‘ఎఫ్ 3’తో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఆయన సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించారు. ఇవాళ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అనిల్.. తన తదుపరి సినిమాని ప్రకటించాడు.

‘గాడ్ ఆఫ్ మాసెస్, రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన 108వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గౌరవంగా ఉంది. ఈ సారి వచ్చే బ్యాంగ్ మామూలుగా ఉండదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. బాలయ్యతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. కాగా, బాలయ్య 107వ సినిమా టీజర్ నిన్ననే విడుదలైన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu