HomeTelugu Trending'మెగాస్టార్ ది లెజెండ్' బుక్ లాంఛ్‌.. ఎమోషనలైన రామ్‌ చరణ్‌

‘మెగాస్టార్ ది లెజెండ్’ బుక్ లాంఛ్‌.. ఎమోషనలైన రామ్‌ చరణ్‌

8
మెగాస్టార్‌ చిరంజీవి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ఈయన ప్రస్థానం, నటనపై ఇప్పటికే చాలా పుస్తకాలు వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి ఎందరో సూపర్ స్టార్స్ ఉన్న సమయం నుంచి ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ స్వశక్తితో మెగాస్టార్ అయ్యాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన జీవితంపై ఇప్పుడు ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’ పేరుతో సీనియర్‌ జర్నలిస్టు వినాయకరావు ఓ పుస్తకం రాశారు. దీని ఆవిష్కరణ కార్యక్రమం పార్క్ హయత్‌ హోటల్‌లో జరిగింది. దీనికి సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు చాలా మంది హాజరైయ్యారు. చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ ఈ పుస్తకాన్ని అవిష్కరించాడు.

ఈ సందర్బంగా చరణ్ మాట్లాడుతూ.. ‘నాన్న గురించి నాకు తెలిసింది తక్కువేనని అనిపించింది. ఈ బుక్‌ ద్వారా మా నాన్నకు ఇంకా ఎక్కువగా దగ్గర అవుతానని భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వినాయకరావుకు మా కుటుంబం, అభిమానులం రుణపడి ఉంటాం.. చిన్నతనంలో నాన్నతో గడిపే అవకాశం తక్కువగా ఉండేది. నేను సినిమాల్లో వచ్చే సమయానికి నాన్న రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆయన పడిన కష్టాలను ఎప్పుడూ దగ్గరగా చూడలేదు. కానీ ‘ఖైదీ నెంబర్‌ 150’తో ఆయనలో కొత్త కోణం అర్థమైంది. ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టాన్ని ప్రతి నిమిషం చూశాను. సైరా సినిమా కోసం రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా 250 రోజులు కష్టపడి చేసి మాకు కొత్త ఉత్సహాని ఇచ్చారు. ఈ బుక్‌ గురించి చదివేటప్పుడు నాన్న గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను’ అని తెలిపాడు. చరణ్‌తో పాటు అల్లు అరవింద్‌, రాఘవేంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, వినాయక్‌, మురళీ మోహన్‌ లాంటి లెజెండ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

8a

Recent Articles English

Gallery

Recent Articles Telugu